- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులకు షాకిచ్చిన యువకుడు.. 28 చోరీలతో ముచ్చెమటలు
<p>దిశ, శేరిలింగంపల్లి : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్ పేట్‌కు చెందిన సయ్యద్ అర్బాస్ అలియాస్ ఇమ్రాన్, చోటా అబ్బుపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతనిపై 2017 నుంచి 2021 వరకు మొత్తం 28 చోరీ కేసులు నమోదయ్యాయి. ఇతను చిన్నతనం నుంచే దొంగతనాలకు పాల్పడుతున్నారని, అనేక సందర్భాలలో […]</p>

దిశ, శేరిలింగంపల్లి : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిపై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్ పేట్‌కు చెందిన సయ్యద్ అర్బాస్ అలియాస్ ఇమ్రాన్, చోటా అబ్బుపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇతనిపై 2017 నుంచి 2021 వరకు మొత్తం 28 చోరీ కేసులు నమోదయ్యాయి. ఇతను చిన్నతనం నుంచే దొంగతనాలకు పాల్పడుతున్నారని, అనేక సందర్భాలలో జువెనైల్ హోంకు వెళ్లి వచ్చారని తెలిపారు.
గచ్చిబౌలి పోలీసులు చోరీ కేసులో ఈ ఏడాది జూన్‌లో అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత అతను మళ్లీ ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నాడని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద గంజాయి వ్యాపారం చేసిన కేసులో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు పోలీసులు.






