Payal Rajputh: 'బంగార్రాజు' తో ఐటెంసాంగ్.. క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ

by  |
Payal Rajputh: బంగార్రాజు తో ఐటెంసాంగ్.. క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో కుర్రకారును తన అందచందాలతో కట్టిపడేసింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం తరవాత అమ్మడికి అవకాశాలైతే అందాయి కానీ విజయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక ‘సీత’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కనిపించి కనువిందు చేసిన ఈ ముద్దుగుమ్మ మరోసారి ఐటెం సాంగ్ లో నర్తించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘బంగార్రాజు’ చిత్రంలో నాగ్ సరసన ఒక పాటలో పాయల్ ఆడిపాడనున్నట్లు గతకొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా పాయల్ స్పందించింది.

నాగ్ సరసన ఓ పాటలో కనిపిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని ఆమె తన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. “మీ అందరికి క్లారిటీ ఇవ్వడానికే పోస్ట్ పెడుతున్నా.. నేను ఎలాంటి సాంగ్ చేయడంలేదు. థాంక్స్” అంటూ ట్వీట్ చేసింది. ఇక అమ్మడి ట్వీట్ తో నాగ్ సరసన ఆదిపడేది పాయల్ కాదన్న విషయం స్పష్టం అయ్యింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆడిపడేది ఎవరో తెలియాలి.


Next Story

Most Viewed