‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి.. పవర్ స్టార్‌ను హత్తుకున్న డైరెక్టర్

by  |
‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి.. పవర్ స్టార్‌ను హత్తుకున్న డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘకాలం విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీగా గడిపిన పవన్, హిందీలో హిట్ అయిన పింక్ మూవీ రీమేక్‌కు ఓకే చెప్పాడు. ఆ తర్వాత వరుసగా షూటింగ్‌లో పాల్గొని దాదాపు 75 శాతం పైగా పూర్తైన అనంతరం కరోనా కారణంగా కొంతకాలం ఆగిపోయింది. దీంతో చిత్రం షూటింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందో తెలియక అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త చెప్పింది. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో అంతా సంతోషపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షూటింగ్ పూర్తైన ఆనందంలో దర్శకుడు వేణు శ్రీరామ్‌ను హత్తుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతేగాకుండా చిత్ర యూనిట్‌లో ఒక గ్రూప్ ఫొటో కూడా దిగాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య పాండేలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతేగాకుండా బాలీవుడ్ రీమేక్‌గా వస్తున్నా ఈ చిత్రంలో తెలుగులో పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు దర్శకుడు వేణు శ్రీరామ్ మార్పులు చేసినట్టు సమాచారం. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. అంతేగాకుండా జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుందని తెలుస్తుంది.

Next Story

Most Viewed