మార్చి 25న వకీల్ సాబ్ టీజర్?

by  |
మార్చి 25న వకీల్ సాబ్ టీజర్?
X

దిశ, వెబ్‌డెస్క్:

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వరుసగా పండుగలు చేసుకుంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన మగువా.. మగువా.. ఇప్పటికే ఓ వైపు రికార్డులను బ్రేక్ చేస్తున్న ఆనందంలో ఉండగానే మరో తీపి కబురు వారి చెవుల్లో తేనే పోసింది. ఉగాది కానుకగా వకీల్ సాబ్ సినిమా టీజర్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్ ‌లుక్‌కి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఓ వైపు ఫస్ట్ లుక్ క్రేజ్, మరోవైపు లిరికల్ వీడియో రికార్డులు పవర్ స్టార్ అభిమానులకు ముందే పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

ఎంసీఏ ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు, బోనీకపూర్‌ నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న వకీల్‌ సాబ్‌ రెండేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న మూవీ కావడంతో పవర్‌స్టార్‌ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమితాబ్‌ బచన్‌ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో తెరకెక్కిన పింక్‌ రీమేక్‌గా వకీల్‌సాబ్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

tags: Power Star Pawan Kalyan, Vakeel Saab, Pink, First look, Teaser, Lyrical Video



Next Story

Most Viewed