మెట్రోలో ప్రయాణించిన పవన్

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్ : హైదరాబాద్ మెట్రో రైలులో జనసేన అధినేత ప్రయాణించారు. గురువారం ఉదయం మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం చేశారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’ షూటింగ్ కోసం మియాపూర్‌ వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ద్రాక్షారామానికి చెందిన రైతు సత్యనారాయణతో పంటలు, ప్రస్తుత పరిస్థితుల గురించి పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వర్షాలకు వ్యవసాయ బాగా దెబ్బతిందని రైతు వాపోయారు. మిమ్మల్ని కలవడం [&hellip;]</p>

మెట్రోలో ప్రయాణించిన పవన్
X

దిశ, వెబ్‎డెస్క్ : హైదరాబాద్ మెట్రో రైలులో జనసేన అధినేత ప్రయాణించారు. గురువారం ఉదయం మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణం చేశారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’ షూటింగ్ కోసం మియాపూర్‌ వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ద్రాక్షారామానికి చెందిన రైతు సత్యనారాయణతో పంటలు, ప్రస్తుత పరిస్థితుల గురించి పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వర్షాలకు వ్యవసాయ బాగా దెబ్బతిందని రైతు వాపోయారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ రైతు ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ప్రయాణం తనకు ఇదే మొదటిసారి అని రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ నవ్వుతూ మీకే కాదు.. తనకు కూడా ఇదే మొదటి సారి అని అన్నారు.

Next Story