పవన్, రానా మూవీకి త్రివిక్రమ్ సేవలు..ఇలా!

by  |
పవన్, రానా మూవీకి త్రివిక్రమ్ సేవలు..ఇలా!
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ను సితార ఎంటర్ టైన్మెంట్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా..సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి సంక్రాంతి సందర్భంగా సూపర్ థ్రిల్లింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సెల్యూలాయిడ్ మెజిషియన్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానిస్తూ.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

మాటల మాంత్రికుడు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 22 నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతుండగా..గురూజీ ప్రాజెక్ట్‌లోకి రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. సంక్రాంతి పవన్ కల్యాణ్ సినిమాల అప్‌డేట్స్‌తో నిండిపోవడంతో ఖుష్ అవుతున్నారు.


Next Story

Most Viewed