సోము వీర్రాజుకు పవన్ గ్రీటింగ్స్

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన సోము వీర్రాజుకు క్షేత్రస్థాయిలో పేదల సమస్యలపై అవగాహన ఉందని అన్నారు.రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సోము వీర్రాజులో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. సేవాతత్పరత కూడా కలిగివున్న వీర్రాజు నాయకత్వంలో బీజేపీ పార్టీ ఏపీలో మరిన్ని విజయాలు సాధించాలని జనసేన తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నట్లు [&hellip;]</p>

సోము వీర్రాజుకు పవన్ గ్రీటింగ్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన సోము వీర్రాజుకు క్షేత్రస్థాయిలో పేదల సమస్యలపై అవగాహన ఉందని అన్నారు.రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న సోము వీర్రాజులో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. సేవాతత్పరత కూడా కలిగివున్న వీర్రాజు నాయకత్వంలో బీజేపీ పార్టీ ఏపీలో మరిన్ని విజయాలు సాధించాలని జనసేన తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నట్లు పవన్ ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీతో కలిసి ముందుకు సాగుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Next Story