నేను కోలుకుంటున్నాను.. ఇది చాలా దురదృష్టకరం : పవన్

by Jakkula Samataha |   (  Updated:2021-04-18 04:51:02  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పవన్ తన ఆరోగ్యం విషయమై సమాచారం అందించారు. తాను కరోన నుంచి కోలుకుంటున్నానని చెప్పారు. బయట కరోనా తీవ్రత చాలా ఉందని, ఇటువంటి సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత ఏర్పడటం దురదృష్టకరమని [&hellip;]</p>

నేను కోలుకుంటున్నాను.. ఇది చాలా దురదృష్టకరం : పవన్
X

దిశ, వెబ్‌డెస్క్ : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పవన్ తన ఆరోగ్యం విషయమై సమాచారం అందించారు. తాను కరోన నుంచి కోలుకుంటున్నానని చెప్పారు.

బయట కరోనా తీవ్రత చాలా ఉందని, ఇటువంటి సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత ఏర్పడటం దురదృష్టకరమని అన్నారు. కొవిడ్ రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికి ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story