మేనల్లుడిపై పవన్ ప్రశంసల వర్షం

by  |
మేనల్లుడిపై పవన్ ప్రశంసల వర్షం
X

దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా ట్రైలర్, ప్రమోషన్ కంటెంట్ చూసిన పవన్.. పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. మొదటి అడుగునే సవాల్‌గా తీసుకున్న వైష్ణవ్, భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటాడని తెలిపారు. ‘జానీ’ చిత్రంలో తన ప్లేస్‌లో హీరో చిన్ననాటి పాత్రను చేసిన తన మేనల్లుడు, ఇప్పుడు హీరోగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు బుచ్చిబాబు సినిమాను సమర్ధవంతంగా తెరకెక్కించారని.. మన జీవితాలు, భావోద్వేగాలు, పరిస్థితుల ఆధారంగా తీసిన ‘ఉప్పెన’ నేటివిటీని కళ్లకు కట్టేలా చూపించిందని.. ఇలాంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రశంసించారు. ‘రంగస్థలం, దంగల్’ లాంటి చిత్రాలతో ‘ఉప్పెన’ను పోల్చిన పవర్ స్టార్.. సినిమాలో ఉన్న ఎమోషన్స్‌కు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారని, ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అందుకుంటుందని ఆకాంక్షించారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించగా.. ఫిబ్రవరి 12న థియేటర్స్‌లో సందడి చేయనుంది ‘ఉప్పెన’.

Next Story

Most Viewed