ఫస్ట్ గ్లింప్స్: 'భీమ్లా నాయక్' గర్జన.. పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే

by  |
beemla naik first glimpse
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి పవర్ ఫుల్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీ గా మారిపోయాడు. ఒక పక్క క్రిష్ తో పిరియాడికల్ మూవీ హరహర వీరమల్లు, మరో పక్క కోలీవుడ్ రీమేక్ ‘అయ్యప్పన్ కోషియమ్’ చిత్రంలో నటిస్తున్నాడు. పవన్- రానా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ రీమేక్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మేకింగ్ వీడియో రికార్డును సృష్టించాయి. కేవలం పవన్ పాత్ర పేరు రివీల్ చేసి హైప్ క్రియేట్ చేసిన యూనిట్ తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఎట్టకేలకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అధికారికంగా విడుదల చేశారు.

ఎప్పటినుంచో పవన్ అభిమానులు అనుకుంటున్నట్లే ఈ సినిమా టైటిల్ ను “భీమ్లా నాయక్” గా ప్రకటించారు. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’గా పవన్ కళ్యాణ్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మాస్‌లో ‘భీమ్లా నాయక్’ పేరు వెళ్లిపోయింది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసారు. దాంతో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఈ వీడియోలో పవన్ ఊర మాస్ స్టైల్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.

ఇక వెనక బాక్ డ్రాప్ లో లాలా.. భీమ్లా.. అడవి పులి.. గొడవ పడి.. ఒడిసిపట్టు.. పిచ్చి కొట్టు.. అంటూ థీమ్ ని ఎలివేట్ చేసిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. పవన్ గర్జిస్తూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. పవన్ ఫ్యాన్స్ ఎలాంటి మాస్ అయితే కోరుకుంటున్నారో అలాంటి పాత్రలో పవన్ కనిపించేసరికి పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ టైటిల్ రోల్ భీమ్లా నాయక్ అనే పోలీస్ పాత్ర పోషిస్తుండగా.. రానా డేనియల్ శేఖర్ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ సీన్స్ యే గూస్ బంప్స్ తెప్పిస్తుంటే ఇక పవన్- రానా మధ్య వచ్చే ఫైట్ సీన్స్ చూస్తే అభిమానులకు పూనకాలే అని తెలుస్తోంది. ఇక చివర్లో పవన్ ఆవేశంగా అరిచే అరుపు.. రానా ధీమాగా చెప్పే మాట ఆద్యంతం సీరియస్ నెస్ తో కూడుకున్న ఫన్ ని జనరేట్ చేస్తున్నాయి.

ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.



Next Story

Most Viewed