వర్చువల్ మీటింగ్‌లోనే న్యాయవాది భోజనం.. వీడియో వైరల్

by  |
వర్చువల్ మీటింగ్‌లోనే న్యాయవాది భోజనం.. వీడియో వైరల్
X

న్యూఢిల్లీ : కరోనా కారణంగా వర్చువల్ మీటింగ్‌లు సర్వసాధారణమయ్యాయి. ఇంట్లోనే ఉండి అధికార పనులూ ఆన్‌లైన్‌లో చేసుకోవడం అందరికీ సులభమైంది కూడా. అయితే కొన్నిసార్లు కెమెరా లేదా మైక్రోఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయకుండానే రోజువారీ పనుల్లో పడిపోతుంటాం. ఇలాంటివే కొన్నిసార్లు చిక్కులు తెచ్చిపెడితే మరికొన్ని సార్లు నవ్వులపువ్వులు పూయిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియోనే నెట్‌లో వైరల్ అవుతున్నది. ఓ న్యాయవాది వర్చువల్ సమావేశంలో పాల్గొన్న తర్వాత వీడియో స్విచ్ ఆఫ్ చేయకుండానే డెస్క్‌పైనే భోజనం చేయడం ప్రారంభించారు. సమావేశంలోనివారందరూ తాను తింటూ ఉంటే చూస్తున్నారన్న సంగతి అతనికి తెలియదు. అందులో నుంచి ఒకరు ఫోన్ చేసి చెప్పడంతో ఉలిక్కిపడి సిస్టమ్‌లోకి చూసి అవాక్కయ్యారు. వెంటనే ప్లేట్ పక్కనపెట్టి సరిదిద్దుకున్నారు. పాట్నా హైకోర్టు న్యాయవాది క్షత్రశాల్ రాజ్‌కు ఈ అనుభవం ఎదురైంది. అయితే, ఆ మీటింగ్‌లో సొలిసిటర జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహెతా కూడా పాల్గొనడం గమనార్హం. క్షత్రశాల్ రాజ్ ఆదుర్దగా స్క్రీన్‌లోకి చూడగానే భోజనాన్ని మాకు కూడా పంపండి అంటూ మెహెతా జోకేశారు. ఫలితంగా సమావేశ వాతావరణం తేలికైంది.

Next Story

Most Viewed