రూల్స్ వర్తిస్తాయి.. రోగులను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు

by  |
రూల్స్ వర్తిస్తాయి.. రోగులను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో డీహెచ్ శ్రీనివాస్ రావు మీడియా మాట్లాడుతూ.. రోగులను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదని పేర్కొన్నారు. బెడ్ కన్ఫర్మ్ కాకుండా ఇక్కడకు రావద్దని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇవే రూల్స్ వర్తిస్తాయని వెల్లడించారు. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణలోకి రోగులను అనుమతించామని తెలిపారు. నేనే పర్సనల్‌గా మానిటర్ చేసి.. నేనే పర్మిషన్ ఇస్తున్నానని అన్నారు. ఏపీ నుంచి వస్తున్న వారంతా సీరియస్ పేషంట్స్ అని చెప్పారు.

ఒక్క పేషెంట్ 5 నుంచి 10 హాస్పిటల్స్ తిరుగుతున్నారు.. దీని వల్ల విలువైన సమయం వృథా అయి ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. బెడ్ ఉంటేనే రాష్ట్రంలోకి రావాలని పొరుగు రాష్ట్రాలకు సీఎస్ లెటర్ రాశారు. అందుకే ఒక కంట్రోల్ రూమ్ ప్రారంభించామని తెలిపారు. పేషెంట్ ముందుగా హాస్పిటల్స్‌లో బెడ్ రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం హాస్పిటల్స్ స్టేట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇస్తాయని వెల్లడించారు. ఆ తర్వాతే పేషెంట్స్‌ మన రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి పత్రం ఇస్తామని అన్నారు. ఈ విషయంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఎయిర్ అంబులెన్స్‌లు కూడా హైదరాబాద్ వస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పారు.

Next Story

Most Viewed