నర్సులు, యువతులతో పాస్టర్ రాసలీలలు.. చర్చిలో అలా చేస్తుండగా..

by  |
gang rape news
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాదులో కీచక పాస్టర్ గుట్టు బయటపడింది. అమాయకపు యువతులను టార్గెట్‌గా పనిచేసే ఓ మత ప్రబోధకుడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉప్పల్‌లోని గాస్పల్ చర్చికి పాస్టర్‌గా పనిచేస్తున్న జోసఫ్ అలియాస్ సాధు.. ప్రముఖ టీవీ ఛానల్లో మత ప్రబోధకుడు‌గా పని చేస్తూ అమాయకపు ఆడపిల్లను టార్గెట్ చేశాడు.

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారిపై లైంగిక దాడి చేసేవాడు. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగ దీసుకొని మోసం చేసేవాడు. అంతే కాకుండా ముగ్గురు అమ్మాయిలను మోసం చేసి, పెళ్లి చేసుకున్నాడు. ఓ నర్సును ట్రాప్ చేసి, శంషాబాద్‌లో లేడిని మోసం చేశాడు. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో పాస్టర్ ఆగడాల పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో ముగ్గురు యువతులు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదు‌లో పేర్కొన్నారు. పాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాస్టర్‌ ను అరెస్ట్‌ చేశారు.

Next Story