రూ.1116 తో దావత్ చేసుకోండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-05 11:05:10  IST  )

<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కులు వచ్చాయని అత్తారింటికి వచ్చిన అల్లుళ్లు మీరు 1116 రూపాయలు ఖర్చు చేసుకుని మంచి దావత్ చేసుకోండి.. మిగిలిన లక్ష రూపాయలు మాత్రం మీ అత్తమామలకు ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం భూత్పూర్ మండల కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 109 మంది లబ్ధిదారులకు ఒక కోటి 9 లక్షల 12, [&hellip;]</p>

minister srinivas goud
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కులు వచ్చాయని అత్తారింటికి వచ్చిన అల్లుళ్లు మీరు 1116 రూపాయలు ఖర్చు చేసుకుని మంచి దావత్ చేసుకోండి.. మిగిలిన లక్ష రూపాయలు మాత్రం మీ అత్తమామలకు ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం భూత్పూర్ మండల కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 109 మంది లబ్ధిదారులకు ఒక కోటి 9 లక్షల 12, 644 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు.

తల్లిదండ్రులు జన్మనిచ్చి, కడుపు మార్చుకుని తమ బిడ్డలను పెంచి పెద్ద చేసి మీకు ఇవ్వడమే కాకుండా కట్న కానుకలు ఇచ్చి ఉంటారు. అల్లుళ్ళు.. కూతుళ్లు అర్థం చేసుకొని కేవలం 1116 రూపాయలు తీసుకొని దావత్ చేసుకుని సంతోషపడండి అని నవ్వుల మధ్య మంత్రి ప్రకటించారు. ఈరోజు ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అందరూ సంతోషంగా ఉంటున్నారు. మీకు అన్ని విధాలా అండగా ఉంటున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వానికి అండగా ఉండాలని మంత్రి సూచించారు. ఎప్పుడూ మనం పనిచేసే మన ముఖ్యమంత్రి కి అండగా నిలవాలని చెప్పారు.

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతూ ప్రజల జీవితాలు మరింత మెరుగు పడతాయి. ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పవర్, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు నర్సింలు గౌడ్, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు మనే మోని సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story