అండర్ కవర్ ఏజెంట్‌గా పరిణీతి

by  |
అండర్ కవర్ ఏజెంట్‌గా పరిణీతి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.. నెక్స్ట్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతుంది. ‘ద గర్ల్ ఆన్ ది ట్రెయిన్’ డైరెక్టర్ రిభు దాస్ గుప్తా డైరెక్షన్‌లో రెండోసారి వర్క్ చేయబోతుండగా.. ఈ సినిమాలో అండర్ కవర్ ఏజెంట్‌గా కనిపించబోతుంది పరిణీతి. రజిత్ కపూర్, దిబ్యేందు భట్టాచార్య, హర్దీ సందు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాలో ఇండియన్ ఏజెంట్స్ కోవర్ట్ రెస్క్యూ ఆపరేషన్ లీడ్ చేసే పాత్రలో పరిణీతి పర్సనల్ జర్నీ, రివేంజ్ స్టోరీ ఆకట్టుకోనుందని తెలుస్తోంది. మార్చి 2021 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న మూవీ కోసం ఫిల్మ్ మేకర్స్ షూటింగ్ స్పాట్స్ పర్మిషన్స్ తీసుకునే పనిలో ఉన్నారని సమాచారం.

కాగా ‘ద గర్ల్ ఆన్ ది ట్రెయిన్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రంలో మీరాగా న్యూ యాంగిల్‌లో కనిపించబోతున్న పరిణీతి.. మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాలో అదితి రావు హైదరీ, కిర్తి కుల్హారీ ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు.

Next Story

Most Viewed