కొత్తగా ట్రై చేయాలంటే ఆఫర్స్ ఎందుకివ్వరు? ఇండస్ట్రీపై పరిణీతి ఫైర్!

by  |
కొత్తగా ట్రై చేయాలంటే ఆఫర్స్ ఎందుకివ్వరు? ఇండస్ట్రీపై పరిణీతి ఫైర్!
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా అప్‌కమింగ్ మూవీ ‘ది గర్ల్ ఆన్ ది ట్రెయిన్’ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. హాలీవుడ్ ఫిల్మ్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన పరిణీతి.. ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ సినిమా ద్వారా కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అందుకున్న ఫీలింగ్ కలిగిందని తెలిపింది. లైఫ్‌లో అన్నీ కోల్పోయి మద్యానికి బానిసైన మీరా కపూర్ క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్నట్టు తెలిపిన హీరోయిన్.. తను ఈ పాత్రకు స్పష్టమైన కాస్టింగ్ కాదని చెప్పింది. కానీ మేకర్స్ తనపై నమ్మకముంచి ఈ పాత్రను ఇచ్చినందకు ధన్యవాదాలు తెలియజేసింది.

ఇండస్ట్రీలో ఎలా ఉందంటే .. ‘ఒక యాక్టర్ అంతకు ముందు ప్లే చేసిన క్యారెక్టర్స్‌ను బేస్ చేసుకునే ఆఫర్స్ వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. రైటర్స్, డైరెక్టర్స్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు.. నాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఆల్రెడీ ఆ యాక్టర్ ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు కాబట్టి తనే బెస్ట్ ఆప్షన్’ అని అనుకుంటున్నారని తెలిపింది. గతంలో చేయని పాత్రలు మన దగ్గరికి రావడం అనేది రేర్‌గా జరుగుతుంటుందని చెప్పింది. కానీ నటీనటులు తాము ఇంతకు ముందు చేయని పాత్రల కోసం వెతుకుతుంటారని, వాటిలో బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తుంటారని తెలిపింది పరిణీతి.



Next Story

Most Viewed