- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంజేపీ హాస్టల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన..
<p>దిశ, గోదావరిఖని : ఎంజేపీ హాస్టల్‌లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలు స్నానాలు చేసే సమయంలో పైకప్పు లేకపోవడంతో పోకిరీలు పక్క బిల్డింగ్‌లపై నుంచి చూస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్‌నగర్‌లోని ఎంజేపీ హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌లో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వసతులు కల్పించడం లేదంటూ నిలదీశారు. విద్యార్థులను భయాందోళనకు […]</p>

దిశ, గోదావరిఖని : ఎంజేపీ హాస్టల్‌లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలు స్నానాలు చేసే సమయంలో పైకప్పు లేకపోవడంతో పోకిరీలు పక్క బిల్డింగ్‌లపై నుంచి చూస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్‌నగర్‌లోని ఎంజేపీ హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌లో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వసతులు కల్పించడం లేదంటూ నిలదీశారు.
విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. విద్యార్థులకు వసతులు కల్పించాలని గత పది రోజుల క్రితమే పాఠశాలలో ఆందోళన జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాలకు చేరుకున్న ఆర్సీఓ రీజనల్ కోఆర్డినేటర్‌కు విద్యార్థి సంఘాలు నాయకులు, విద్యార్థులు తల్లిదండ్రులు వినతి పత్రాలను అందజేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.
- Tags
- godavarikhani






