- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హృదయ విదారకర ఘటన.. తల్లి మృతదేహం పక్కనే కూర్చున్న చిన్నారి
<p>దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామానికి భూమవ్వ అనే మహిళ అనారోగ్యంతో మంగళవారం మృతిచెందింది. కొంతకాలం క్రితం ఆమె భర్త కూడా చనిపోయాడు. దీంతో వారికున్న ఐదేండ్ల చిన్నారి రోషిని అనాథగా మారి ఇంట్లో రోదిస్తోంది. గమనించిన స్థానికులు పేద కుటుంబం అని, చిన్నారికి ఆర్థికసాయం చేయాలని గ్రామంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో విషయం షేర్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన మానవతా దృక్పదం ఉన్నవారు […]</p>

X
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో హృదయ విదారకర ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామానికి భూమవ్వ అనే మహిళ అనారోగ్యంతో మంగళవారం మృతిచెందింది. కొంతకాలం క్రితం ఆమె భర్త కూడా చనిపోయాడు. దీంతో వారికున్న ఐదేండ్ల చిన్నారి రోషిని అనాథగా మారి ఇంట్లో రోదిస్తోంది. గమనించిన స్థానికులు పేద కుటుంబం అని, చిన్నారికి ఆర్థికసాయం చేయాలని గ్రామంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో విషయం షేర్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన మానవతా దృక్పదం ఉన్నవారు రూ.95 వేల ఆర్థికసాయం చేశారు. ఈ క్రమంలో తల్లి మృతదేహం పక్కన అమాయకంగా కూర్చున్న చిన్నారిని చూసి గ్రామస్తులందరూ కంటనీరు తెచ్చుకుంటున్నారు. అభశుభం తెలియని వయసులో అనాథగా మారిన చిన్నారికి 9949037729 google pay/phonepe ద్వారా ఆర్థికసాయం చేయాలని మానవతా వాదులు కోరుతున్నారు.
Next Story






