పరకాల యునానీ ఆస్పత్రిలో విచిత్రం.. డాక్టర్‌‌గా విధులు నిర్వహిస్తున్న ఫార్మాసిస్ట్..

by Shyam |   (  Updated:2021-11-15 23:42:31  IST  )

<p>దిశ, పరకాల : ప్రజలు అల్లోపతి మందుల ద్వారా సైడ్ ఎఫెక్ట్ బారిన పడే అవకాశం ఉండటంతో కొందరు రోగులు అందుకు ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద, యునాని వైద్యాన్ని పొందుతారు. అందులో భాగంగా పరకాల పరిసర గ్రామాల ప్రజలకు యునాని వైద్య సేవలు అందించుటకు గాను 1983లో పరకాల కేంద్రంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం యునాని వైద్యశాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పరకాల చుట్టుపక్కల మండల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి ఒకప్పుడు ప్రజాదరణ [&hellip;]</p>

పరకాల యునానీ ఆస్పత్రిలో విచిత్రం.. డాక్టర్‌‌గా విధులు నిర్వహిస్తున్న ఫార్మాసిస్ట్..
X

దిశ, పరకాల : ప్రజలు అల్లోపతి మందుల ద్వారా సైడ్ ఎఫెక్ట్ బారిన పడే అవకాశం ఉండటంతో కొందరు రోగులు అందుకు ప్రత్యామ్నాయంగా ఆయుర్వేద, యునాని వైద్యాన్ని పొందుతారు. అందులో భాగంగా పరకాల పరిసర గ్రామాల ప్రజలకు యునాని వైద్య సేవలు అందించుటకు గాను 1983లో పరకాల కేంద్రంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం యునాని వైద్యశాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పరకాల చుట్టుపక్కల మండల ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి ఒకప్పుడు ప్రజాదరణ పొందింది. కానీ అందుకు భిన్నంగా గత కొన్ని సంవత్సరాలుగా పరకాల ప్రభుత్వ యునాని ఆసుపత్రి ఉన్నతాధికారులు, ఈ ప్రాంతం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా ప్రజాదరణను కోల్పోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిపుణులైన వైద్యులచే వైద్య సేవలు అందించలేకపోవడం మూలంగా ఈ ఆస్పత్రి నిరాదరణకు గురవుతోంద‌ని పలువురు ఆరోపిస్తున్నారు. 2018 నుండి ఇక్కడ వైద్యుడి పోస్టు ఖాళీగానే ఉండడం గమనార్హం. దీంతో ఫార్మసిస్ట్ నేతుల రాజేశ్వరే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. నిపుణులైన వైద్యులచే రోగులను పరీక్షించి వారికి తగిన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు భిన్నంగా ఈ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ ద్వారా వైద్య సేవలు అందించడం రోగుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నిపుణుడైన వైద్యున్ని నియమించి వైద్య సేవలు అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story