- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి మృతి..
<p>దిశ, మానకొండూరు : రోడ్డు ప్రమాదంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి తూముల రాజేందర్ మృతి చెందాడు. ఈనెల 16వ తేదీన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లె గ్రామంలో విధులు నిర్వహించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే జేపీఎస్ డీపీఓ వీర బుచ్చయ్య కరీంనగర్‌లోని లక్ష్మీనరసింహ న్యూరో హస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. బుధవారం రాత్రి రెండు గంటల వరకు అక్కడే ఉండి సర్జరీ చేయించగా, రెండు లక్షలకు పైగా డబ్బులు […]</p>

X
దిశ, మానకొండూరు : రోడ్డు ప్రమాదంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి తూముల రాజేందర్ మృతి చెందాడు. ఈనెల 16వ తేదీన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివానిపల్లె గ్రామంలో విధులు నిర్వహించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే జేపీఎస్ డీపీఓ వీర బుచ్చయ్య కరీంనగర్‌లోని లక్ష్మీనరసింహ న్యూరో హస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.
బుధవారం రాత్రి రెండు గంటల వరకు అక్కడే ఉండి సర్జరీ చేయించగా, రెండు లక్షలకు పైగా డబ్బులు ఖర్చయ్యాయి. అయితే, తలలో రక్తం గడ్డ కట్టి కోమాలోకి వెళ్లడాని డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడు మానకొండూరు మండలం ఊటూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయనకు భార్య, కొడుకు, బిడ్డ ఉన్నట్లు సమాచారం.
Next Story






