- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన ఐదో రౌండ్.. మళ్లీ కారుదే హవా
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన హావాను కొనసాగిస్తున్నారు. మొదటి నాలుగు రౌండ్లలో ఆధిక్యం కనబర్చిన పల్లా.. తాజాగా వచ్చిన ఐదో రౌండ్ ఫలితాల్లోనూ ఆధిక్యం దిశగా దూసుకెళ్లారు. ఐదో రౌండ్లలో కలిపి ఏకంగా 18,549 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక ఐదో రౌండ్ ఫలితాలను వివరాలకొస్తే.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,671 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు […]</p>

దిశ ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన హావాను కొనసాగిస్తున్నారు. మొదటి నాలుగు రౌండ్లలో ఆధిక్యం కనబర్చిన పల్లా.. తాజాగా వచ్చిన ఐదో రౌండ్ ఫలితాల్లోనూ ఆధిక్యం దిశగా దూసుకెళ్లారు. ఐదో రౌండ్లలో కలిపి ఏకంగా 18,549 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
ఇక ఐదో రౌండ్ ఫలితాలను వివరాలకొస్తే.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,671 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు 12,560 ఓట్లు, కోదండరామ్‌కు 9585, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 5288 ఓట్లు వచ్చాయి. ఈ ఐదో రౌండ్‌లో 3111 ఓట్ల ఆధిక్యాన్ని పల్లా సాధించారు. ఇదిలావుంటే.. మొత్తం ఐదు రౌండ్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 79,113 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 60,564 ఓట్లు, కోదండరామ్ కు 49,200 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 28,991 ఓట్లు వచ్చాయి. మొత్తంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి 18,549 ఓట్ల ఆధిక్యంతో మొదటి స్థానంలో నిలిచారు.






