- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరు జిల్లాలో పాకిస్థానీ?
by Vemula.Srinu Prasad |
<p>చిత్తూరు జిల్లాలో పాకిస్థానీ హల్‌చల్ చేయడం కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే… తొట్టంబేడు మండలంలోని చియ్యవరంలో గుర్తుతెలియని వ్యక్తి (41) గత రాత్రి చిన్న బ్యాగుతో కనిపించాడు. దీంతో అతనిని గ్రామస్థులు ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అంటూ ప్రశ్నించారు. దీంతో పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు ఆయన హిందీలో చెప్పాడు. తనతో పాటు మరో నలుగురు వచ్చినట్టు వెల్లడించాడు. దీంతో పాక్ నుంచి కరోనా అంటించేందుకు వచ్చాడన్న ఆందోళనతో అతనిని […]</p>

X
చిత్తూరు జిల్లాలో పాకిస్థానీ హల్‌చల్ చేయడం కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే… తొట్టంబేడు మండలంలోని చియ్యవరంలో గుర్తుతెలియని వ్యక్తి (41) గత రాత్రి చిన్న బ్యాగుతో కనిపించాడు. దీంతో అతనిని గ్రామస్థులు ఎవరు మీరు? ఎవరి కోసం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అంటూ ప్రశ్నించారు. దీంతో పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు ఆయన హిందీలో చెప్పాడు. తనతో పాటు మరో నలుగురు వచ్చినట్టు వెల్లడించాడు. దీంతో పాక్ నుంచి కరోనా అంటించేందుకు వచ్చాడన్న ఆందోళనతో అతనిని చుట్టుముట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో ఉన్న సంచిలో ఏవో కాయలుండగా, వాటిని మత్తుకాయలుగా భావించి జనం ఆందోళన చెందారు.
Tags: chittoor district, pakistani, thottambedu, police
Next Story






