వావ్ .. వంద కిలోల లెహెంగా

by  |
వావ్ .. వంద కిలోల లెహెంగా
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి మనిషి జీవితంలో.. పెళ్లి ఓ మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది. అందుకే పెళ్లి రోజున ప్రత్యేకంగా కనిపించాలని వధూవరులు భావిస్తారు. అందులోనూ పెళ్లి కూతురి గురించి వేరే చెప్పనక్కర్లేదు. నఖశిఖ పర్యంతం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. చేతిలో పూసే గోరింటాకు నుంచి.. కొప్పులో విరిసే పూదండ వరకు అన్నీ స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన ఓ వధువు తన పెళ్లి రోజు ధరించే లెహెంగాను ఎంతో ఇష్టపడి కుట్టించుకుంది. అయితే అందులో ప్రత్యేకత ఏముందంటారా ? మామూలుగా లెహంగాలు కాస్త బరువుగానే ఉంటాయి. కానీ ఆ పాక్ పెళ్లి కూతురి లెహెంగా ఏకంగా 100 కిలోలు ఉండటమే ప్రత్యేకత. కాగా ఇంటర్నెట్‌లో ఆ లెహెంగా ధరించిన పెళ్లి కూతురి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ యువతి వివరాలేవీ తెలియక పోయినప్పటికీ వీడియోలు మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

పెళ్లి లెహెంగా విషయంలో.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలు కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. గ్లోబర్ స్టార్ ప్రియాంక, అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌నును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న రోజున.. ప్రియాంకా రెడ్ లెహెంగా ధరించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి దీన్ని డిజైన్ చేశారు. ఆ లెహెంగాను డిజైన్ చేయడానికి ఏకంగా 3,720 గంటలు పట్టింది. 110 మంది ఎంబ్రాయిడర్లు దాని కోసం కష్టపడ్డారు.

‘పద్మావతి’ సినిమాలోని.. ‘ఘుమార్ ఘుమార్’ పాటలో దీపికా ఓ భారీ లెహెంగాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె ధరించిన ఆ లెహెంగా దాదాపు 30 కిలోల బరువు ఉండటంతో.. అందరూ ఆశ్చర్యపోయారు. దాని ధర కూడా 30 లక్షల పైనే. అంతేకాదు దీపికా తన పెళ్లిలో ధరించిన లెహెంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని కూడా సవ్యసాచే డిజైన్ చేయగా.. ఆ లెహెంగా కోసం ఏకంగా 16 గంటలు కష్టపడ్డారు. మన టాలీవుడ్ బ్యూటీ సమంత కూడా పెళ్లి లెహెంగాను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. చైతూతో తమ ప్రేమ ప్రయాణాన్ని ఆ లెహెంగాపై ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.

Next Story

Most Viewed