జై శ్రీరామ్ అంటోన్న పాక్ మాజీ క్రికెటర్ 

by Shyam |

<p>దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజపై స్పందించారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టును పెట్టారు. &#8220;రాముని అందం పేరులో కాదు ఆయన గుణంలో ఉంది. చెడుపై విజయానికి చిహ్నం రాముడు. ప్రపంచంలోని హిందువులందరికీ సంతోషాన్ని కలిగించే చారిత్రాత్మక ఘట్టం ఇది. జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేసారు డానిష్. The beauty of Lord Rama lies in his character, not in his name. He is a symbol of the victory of [&hellip;]</p>

జై శ్రీరామ్ అంటోన్న పాక్ మాజీ క్రికెటర్ 
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజపై స్పందించారు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టును పెట్టారు. “రాముని అందం పేరులో కాదు ఆయన గుణంలో ఉంది. చెడుపై విజయానికి చిహ్నం రాముడు. ప్రపంచంలోని హిందువులందరికీ సంతోషాన్ని కలిగించే చారిత్రాత్మక ఘట్టం ఇది. జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేసారు డానిష్.

ఆయన చేసిన ఈ ట్వీట్ ని తెగ వైరల్ చేస్తున్నారు పాక్, ఇండియా లోని హిందువులు. దీనికంటే ముందు ఆయన మరో ట్వీట్ కూడా చేసారు. అది కొద్దిసేపటికే డిలీట్ చేసారు. డిలీట్ చేసిన ట్వీట్ లో అయోధ్య రామాలయం నమూనా ఫోటో పెట్టి జై శ్రీరామ్ అని ట్యాగ్ చేసారు. కాగా కొందరు నెటిజెన్లు సదరు ట్వీట్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేస్తూ ఇది పాకిస్తాన్ లో హిందువుల భయానికి నిదర్శనం అంటూ కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/HibernationON/status/1291141358132969472?s=20

కాగా పాకిస్తాన్ హిందూ అయిన డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని, అతనిపై జీవితకాల నిషేధం విధించింది పాక్ క్రికెట్ బోర్డు.

Next Story