Sex in a Plane : విమానంలో లవర్స్ సెక్స్..ఎంకరేజ్ చేసిన ఎయిర్ హోస్టస్

by  |
Sex in a Plane : విమానంలో లవర్స్ సెక్స్..ఎంకరేజ్ చేసిన ఎయిర్ హోస్టస్
X

దిశ, వెబ్‌డెస్క్: శృంగారం (sex)నాలుగు గోడల మధ్య జరిగితేనే అందంగా ఉంటుంది. అది నలుగురి ముందు చేస్తే చిరాకుగా ఉంటుంది. తాజాగా ఓ జంట తమ కామ క్రీడలను నలుగురు ముందు చేస్తూ చిరాకు తెప్పించారు. ఇక వారి శృంగారానికి ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సివచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ ఘటన కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు వెళుతున్న పీఏ200 విమానంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ కి చెందిన ఓ యువజంట కరాచీ నుంచి ఇస్లామాబాద్ కి వెళ్తున్న పీఏ200 విమానంలో ఎక్కారు.

విమానం ఎక్కిన దగ్గరనుండి ఆ జంట శృంగారంలో(sex) మునిగిపోయారు. ఒకరికొకరు ముద్దులు పెట్టుకొంటూ, కౌగిలించుకుంటూ కామక్రీడలు (Romance) కొనసాగించారు. ఇక ఇదంతా గమనిస్తున్న తోటి ప్రయాణికులు వారి ప్రవర్తన గురించి ఎయిర్ హోస్టస్ కి తెలిపారు. వెంటనే ఆమె ఆ జంట వద్దకు వెళ్లి.. విమానంలో ఇలాంటి పనులు చేయడం కుదరదని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని వివరించింది. అయినా, వారు మాత్రం అవేమి పట్టించుకోకుండా తమ రాసలీలలను కొనసాగించారు. ఇక దీంతో ఎయిర్ హోస్టస్ చేసేదేమిలేక వారిద్దరిపై దుప్పటి కప్పి వెళ్ళిపోయింది.

ఇక ఇదంతా గమనిస్తున్న బిలాల్ అనే లాయర్ ముద్దులతో ఆ జంట అంతలా చెలరేగిపోతుంటే.. వారిపై చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి కంప్లైంట్ చేశాడు. దీంతో సివిల్ ఏవియేషన్ అథారిటీ మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ సీపీఏ వార్నింగ్ ఇవ్వడంతో పాటు సదరు ఎయిర్ హోస్టస్ ని ఉద్యోగం నుండి తొలగించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Next Story

Most Viewed