Cricket: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ తీవ్రంగా వ్యతిరేకించిన పహెల్గాం బాధితురాలు

by Prasad Jukanti |   (  Updated:2025-09-13 10:12:12  IST  )

ఆసియా కప్ లో భారత్ - పాక్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Cricket: భారత్‌-పాక్‌ మ్యాచ్‌  తీవ్రంగా వ్యతిరేకించిన పహెల్గాం బాధితురాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆసియా కప్ లో భారత్ - పాక్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న మ్యాచ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ మ్యాచ్ పై పహెల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మ్యాచ్ కు అంగీకరించకుండా ఉండాల్సిదని అన్నారు. పాక్ తో భారత్ మ్యాచ్ ఆడటం పట్ల సోషల్ మీడియా వేదికగా భారతీయ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Next Story