హస్తప్రయోగమే ముద్దు.. మొగుడు వద్దంటున్న హీరోయిన్

by  |
హస్తప్రయోగమే ముద్దు.. మొగుడు వద్దంటున్న హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో పలువురు నటీనటులు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. కొందరు పాపులారిటీ కోసం అయితే.. మరికొందరు సరదా కోసం.. ఇంకొందరు తమ వ్యక్తిగత అభిప్రాయం అని సమాధానమిస్తున్నారు.ఈ కోవలోకే ఒవియా హెలెన్ కూడా వచ్చిచేరింది. ఈ నటి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ, తమిళనాట మాత్రం బాగా పాపులర్. అక్కడ బిగ్ బాస్ షోతో పాటు సినిమాలు కూడా చేసింది. దాంతో అక్కడ మంచి ఇమేజ్ సంపాదించుకుంది. దానికితోడు వరసగా కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ కూడా చేస్తుంటుంది ఒవియా. ఈ మధ్యకాలంలో తెలుగులో తరుణ్ హీరోగా వచ్చిన ‘ఇది నా లవ్ స్టోరీ’ సినిమాలో మెరిసింది. అది మినహా ఇక్కడ అవకాశాలు రాలేదు.

అయితే, ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లి గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీకు భర్త అవసరం ఉందా.. అసలు పెళ్లి చేసుకునే ఉద్ధేశం ఉందా అంటూ.. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

దానికి ఒవియా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ముఖ్యంగా తనకు భర్త అవసరం లేదని.. అసలు పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు మొగుడు అవసరం లేదని.. దానికంటే హస్త ప్రయోగం చేసుకోవడం బెటర్ అని.. తాను అదే చేస్తానని.. బోల్డ్‌గా సమాధానం చెప్పేసింది. హస్త ప్రయోగం చేసుకుంటాను కానీ, పెళ్లి మాత్రం వద్దంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.

Next Story