జూన్‌లో 4 శాతం పెరిగిన ఉద్యోగ నియామకాలు!

by  |
Job postings
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్, సంబంధిత ప్రతికూల పరిణామాలు ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసినప్పటికీ జూన్‌లో మొత్తం ఉద్యోగ నియామకాలు 4 శాతం మెరుగుపడ్డాయని ఓ నివేదిక తెలిపింది. గత ఆరు నెలలుగా వివిధ రంగాల్లో ఉద్యోగాల నియామకాలు పెరుగుదల నమోదవుతున్నాయని మన్‌స్టార్ డాట్ కామ్, క్వెస్ సంస్థల సంయుక్త నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో 4 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఉద్యోగ నియామకాలు 7 శాతం వృద్ధి నమోదైంది. రానున్న రోజుల్లో నియామక వృద్ధి మరింత పెరిగే అవకాశముందని నివేదిక అభిప్రాయపడింది.

నివేదిక ప్రకారం.. దిగుమతి-ఎగుమతుల పరిశ్రంల్లో 25 శాతం, ఉత్పత్తి, తయారీ రంగాల్లో 14 శాతం, షిప్పింగ్, మెరైన్ రంగంలో 11 శాతం, ఆరోగ్య, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌లో 1.75 శాతం, ఫార్మా రంగంలో 10 శాతం వృద్ధి నమోదయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలు, టెలికాం, రియల్ ఎస్టేట్, మీడియా రంగాల్లో స్వల్పంగా పెరిగాయి. ప్రయాణ, పర్యాటక రంగాల్లో నియామకాలు మునుపటి నెలలతో పోలిస్తే 3 శాతం సానుకూల వృధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. వ్యవసాయ ఆధారిత, ఎఫ్ఎంసీజీ, ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ పరిశ్రమల్లో జాబ్ పోస్టింగ్‌లు తక్కువగా 1 శాతం వృద్ధి సాధించాయి.


Next Story