- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి రానున్న ధురంధర్.. ఎప్పుడంటే
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సినిమా ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సినిమా ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఊహించని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ భారీ విజయాన్ని అందుకుంది. రోజురోజుకూ వసూళ్లలో కొత్త రికార్డుల్ని నమోదు చేస్తోంది. మౌత్ టాక్ తో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించుకుంటోంది ఈ సినిమా. ధురంధర్ లో కథ అంతా కరాచీ అండర్ వరల్డ్ చుట్టూనే తిరుగుతుంది. ISI, అండర్ వరల్డ్ మధ్య జరిగే సంఘటనల చుట్టూనే ఈ కథ సాగుతుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్లలో సినిమా ఉండగానే.. ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ధురంధర్ సినిమా డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. 2026 జనవరి 30న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా సినిమాను విడుదల చేసే అవకాశం ఉండటంతో.. తెలుగు ప్రేక్షకులు సైతం ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు రణవీర్ సింగ్ నటన ప్రాణం పోసిందని ఇప్పటికే అనేకమంది కితాబిచ్చారు. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధురంధర్.. ఓటీటీలో ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






