- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT MOVIES: ఓటీటీలోకి వచ్చేస్తున్న రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ప్రస్తుతం ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే. థియేటర్లలో రిలీజ్ అయిన మూవీ 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో దీనిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అయితే థియేటర్లలో విడుదల అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటి వాటి ప్లాట్ ఫామ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
హిట్-3:(HIT-3)
నేచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించిన మూవీ ‘హిట్-3’(Hit-3). శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి నాని, ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Tripirneni) నిర్మాతలుగా వ్యవహరించారు. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేయనుంది. మరో ఐదు రోజుల్లో హిట్-3 ఓటీటీలోకి రిలీజ్ కానుంది. మే 29న నుంచి నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ డేట్ మెన్షన్ చేస్తూ పెట్టింది. కాగా నెలరోజులు కాకుండానే ఓటీటీలోకి రిలీజ్ కావడం విశేషం.
సికిందర్ మూవీ:(Sikindar Movie)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan), నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) మందన్న హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా ‘సికిందర్’(Sikindar). ఇక క్రేజీ డైరెక్టర్ ఆర్ మురుగదాస్(Murugadas) దర్శకత్వం వహించారు. కాజల్(Kajal) కీ రోల్ ప్లే చేసిన ఈ చిత్రం మార్చి 30న థియేటర్లలో విడుదలైన సికిందర్ బాక్సాఫీస్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే యావరేజ్‌గా నిలిచిన సికిందర్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి నుంచే సికిందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆదివారం(మే25) సికిందర్ ఓటీటీ రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది. కాగా ఈ చిత్రం తెలుగు, ఇతర సౌత్ భాషల్లో సికిందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.






