‘టైగర్ 3’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

by Disha Web Desk 6 |
‘టైగర్ 3’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా కత్రీనా కైఫ్ నటించగా.. విలన్‌గా ఇమ్రాన్ హష్మీ నటించాడు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూలు చేసింది. కానీ, గత రెండు రోజులుగా మాత్రం కలెక్షన్స్ జోరు కాస్త తగ్గిపోయింది. అందుకు కారణం వరల్డ్ కప్ అని తెలుస్తోంది.

ఇక తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినపడుతుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్ధ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఇందుకు భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్‌తో డీల్ కుదుర్చుకున్నారట మేకర్స్. ఇక థియేట్రికల్ రన్ పూర్తికాగానే, డిసెంబర్ మూడో వారంలో లేదా క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed