- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడుదల అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేసిన మూవీ.. ఇదేం ట్విస్టురా అయ్యా అంటున్న నెటిజన్స్
నందమూరి కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి(Vijayashanthi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi).

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కల్యాణ్ రామ్(Kalyan Ram), విజయశాంతి(Vijayashanthi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటించింది. అయితే ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసులు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇక అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, పృథ్వీ రాజ్, చరణ్ రాజ్, భరత్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.
ఇక భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజై యావరేజ్‌గా నిలిచింది. అలా సోసో అనిపించుకున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ ఇప్పుడు సడెన్‌గా ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం (మే12) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, యూకేలో ఉన్నవాళ్లు అది కూడా అద్దె విధానంలో మాత్రమే ఈ మూవీని చూడొచ్చు. అయితే ఈ గురువారం లేదా శుక్రవారం ఇండియాలో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావొచ్చునని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్స్ ఇదేం ట్విస్టురా అయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






