- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TEST: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న లేడీ సూపర్ స్టార్ సినిమా..
డైరెక్టర్ శ్రీకాంత్(Srikanth) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్ మూవీ ‘టెస్ట్’(Test).

దిశ, సినిమా: డైరెక్టర్ శ్రీకాంత్(Srikanth) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్ మూవీ ‘టెస్ట్’(Test). ఈ సినిమాలో నయనతార(Nayanathara) లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ చిత్రంలో మాధవన్(Madhavan), సిద్ధార్థ్(Siddharth), మీరా జాస్మిన్(Meera Jasmine) వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే స్టార్టింగ్‌లో థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమాని ప్రస్తుతం థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నరాట. ఇందులో భాగంగా ఈ మూవీ త్వరలో ఓటీటీ(OTT)లో రానున్నదట. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది. శక్తిశ్రీ గోపాలన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని.. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రెయిట్ రిలీజ్‌పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.






