- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘తండేల్’ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆ ప్రముఖ సంస్థ.. మంచి హైప్ ఇచ్చారంటూ నెటిజన్ల కామెంట్స్

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ప్రజెంట్ యూత్ ఫేవరెట్ లిస్ట్‌లో తండేల్ మూవీ సాంగ్సే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలా విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్‌కి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తన మ్యూజిక్‌తో అదరగొట్టేశాడంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. తండేల్ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్‌తో పాటు ఈ సినిమా డిజిటల్ పార్టనర్(Digital Partner)ను కన్ఫామ్ చేశారు మేకర్స్. ఇక తండేల్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి నెట్‌ఫ్లిక్స్(Netflix) దక్కించుకుంది.
నాగ చైతన్య కెరీర్‌లోనే ఈ మూవీ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ రానున్నట్లు ఒప్పందం చేశారట మూవీ మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఓటీటీ(OTT) స్ట్రీమింగ్ పార్టనర్‌ని కూడా చెప్పేసి ఓటీటీ ప్రేక్షకులకు కూడా మంచి హైప్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.