Surya's 'Retro': అప్పుడే ఓటీటీలోకి రెట్రో.. నిరుత్సాహంలో సూర్య ఫ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-05-14 14:40:39  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) రీసెంట్‌గా ‘రెట్రో’ (Retro) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Suryas Retro: అప్పుడే ఓటీటీలోకి రెట్రో.. నిరుత్సాహంలో సూర్య ఫ్యాన్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) రీసెంట్‌గా ‘రెట్రో’ (Retro) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ఆడియన్స్‌లో ‘రెట్రో’పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో.. ఎన్నో అంచనాల మధ్య మే 1న థియేటర్స్‌లోకి వచ్చింది. కానీ అనుకున్నంతగా క్రేజ్ తెచ్చుకోలేక పోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే థియేటర్‌లో రిలీజైనా కేవలం 15 రోజులకే ఈ సినిమా ఓటీటీ (OTT) అప్‌డేట్ వచ్చేసింది. ‘రెట్రో’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్‌పై అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేరకు ‘తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో రెట్రో త్వరలో ఓటీటీలోకి రాబోతుంది’ అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అయితే.. రిలీజ్ డేట్ ఇంకా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. కేవలం 15 రోజులకే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం కావడంతో సూర్య ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story