ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ స్టార్ ‘జైలర్’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Disha Web Desk 6 |
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ స్టార్ ‘జైలర్’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల నటించిన చిత్రం ‘జైలర్’. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. ఇందులో తమన్నా, మీర్ణా మీనన్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. జైలర్ ఆగస్టు 10వ తేదీన విడుదలై ఫస్ట్ షోతోనే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు అదికారిక ప్రకటన విడుదలైంది. సెప్టెంబర్ 7 నుంచి తమ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ట్విట్టర్ వేదికగా తెలిపింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Read More: ‘జైలర్’ సక్సెస్.. డైరెక్టర్ నెల్సన్‌కు ప్రొడ్యూసర్ అదిరిపోయే గిఫ్ట్

Next Story

Most Viewed