- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే? (పోస్ట్)
గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ ఎంతలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ ఎంతలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. కొన్ని స్టార్ హీరో చిత్రాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వెబ్‌సిరీస్‌లతో పాటు పలు సినిమాలు కూడా ఓటీటీలో ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకుంటున్నాయి. తాజాగా, ఓ మలయాళ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. అసిఫ్ అలీ(Asif Ali), అనస్వర రాజన్ (Anaswara Rajan)కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ‘రేఖాచిత్రం’(Rekhachithram ).
దీనిని జాఫిన్ టి. చాకో తెరకెక్కించగా.. ఇందులో మనోజ్, కె జయన్, సిద్దిఖి, జగదీశ్(Jagadish), సాయి కుమార్(Sai Kumar), హరిశ్రీ, ఆకోకన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక ఈ థ్రిల్లర్ సినిమా జనవరి 9 థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా కేవలంరూ. 8 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కి.. బాక్సాఫీసు వద్ద ఏకంగా రూ. 55 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు ప్రముఖ సంస్థ సోనీలీవ్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ బాషల్లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ రేఖాచిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో అడవిలో ఓ వ్యక్తిని ఎవరో హత్య చేసి పాతిపెట్టగా.. అక్కడికి పోలీసులు వచ్చి ఆయన బాడీ పార్ట్స్‌ను బయటకు తీసి కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. అలా వరుస హత్యలు చోటుచేసుకుంటుండగా.. హీరోయిన్‌ను చూపిస్తారు. అసలు ఆ హత్యలతో హీరోయిన్‌కు ఉన్న సంబంధం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ పోస్ట్‌కు ‘‘అందరూ మర్చిపోయిన నేరం.. పాతిపెట్టిన నిజాన్ని వెలికితీసే సమయం ఆసన్నమైంది’’ అనే క్యాప్షన్ జత చేశారు.






