OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు సింగిల్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

by Chukka Sudharani |   (  Updated:2025-06-06 10:48:20  IST  )

యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ (single).

OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు సింగిల్.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ (single). ఇందులో వెన్నెల కిశోర్ (Vennela Kishore) ప్రధాన పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీస్ ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించి మెప్పించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తు్న్నారు.

రిలీజ్‌కు ముందు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ సడెన్‌గా ఓటీటీ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ‘సింగిల్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకోగా.. ‘సింగిల్’ ఇప్పుడు మీ ఇళ్లకు అల్టిమేట్ మ్యాడ్‌నెస్ & నవ్వుల తుఫానును తెచ్చిపెట్టింది. సంచలనాత్మక వేసవి బ్లాక్‌బస్టర్ సింగిల్ మూవీని ఇప్పుడే ఆస్వాదించండి’ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్టర్ రిలీజ్ చేసింది.

Next Story