ఓటీటీలోకి శివ కార్తికేయన్ ‘కురంగు పెడల్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Mallepaka Hamsa |

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

ఓటీటీలోకి శివ కార్తికేయన్ ‘కురంగు పెడల్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఓ వైపు హీరోగా పలు సినిమాలు చేస్తూనే.. ఇటీవల ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశాడు. కమల్ కన్నన్ డైరెక్షన్‌లో శివ కార్తికేయన్ ప్రోడ్యూస్ చేసిన మూవీ ‘కురంగు పెడల్’. ఇందులో కాళీ వెంకట్, వీఆర్ రాఘవన్, ఎమ్ గుణశేఖర్, రతీష్, సంతోష్ కీలక పాత్రల్లో కనిపించారు.

అయితే ఈ సినిమా మే 3న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా కురంగు పెడల్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆ మూవీ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. అయితే మొదట తమిళంలో స్ట్రీమింగ్ చేసి కొద్ది రోజులకు తెలుగు వెర్షన్‌ను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారట.

Next Story