OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’.. అఫీషియల్ పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

సిద్దు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ ‘జాక్’ (Jack).

OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’.. అఫీషియల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: సిద్దు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ ‘జాక్’ (Jack). ‘కొంచెం క్రాక్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహించగా.. ఇందులో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటించింది. బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఇక రిలీజ్‌కు ముందు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాను ప్రేక్షకుల మధ్యలోకి తీసుకెళ్లిన ఎలాంటి ఉపయోగం లేకపోయింది.

భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చి కేవలం మిక్సిడ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. దీంతో రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ‘జాక్’ సినిమా డిజిటల్ ప్రీమియర్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. ఈ మేరకు ‘‘జాక్’ ఓటీటీ (OTT) విడుదల మే 1న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ప్రీమియర్ కానుంది. గతంలో మే 9న షెడ్యూల్ చేయగా.. ఇప్పుడు ముందుగానే వస్తోంది.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో కూడా అందుబాటులో ఉంది’ అంటూ ఓ పోస్టర్ రిలజ్ చేసింది. అయితే.. మొదటి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ మే 9న అనుకోగా.. సినిమా అంతగా హిట్ కాకపోవడంతో ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.

Next Story