రీలోడెడ్ వెర్షన్‌తో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘పుష్ప-2’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2025-01-28 12:01:04  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటించిన ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే.

రీలోడెడ్ వెర్షన్‌తో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘పుష్ప-2’.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) కలిసి నటించిన ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ‘పుష్ప’ సీక్వెల్‌గా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డిసెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చి భారీ కలెక్షన్లు రాబడుతూ రికార్డు సృష్టిస్తోంది. అంతే స్థాయిలో వివాదాలు కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇటీవల మేకర్స్ థియేటర్స్‌లో రీలోడెడ్ వెర్షన్‌ను యాడ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1896 కోట్లు రాబట్టింది.

విడుదలై ఏడు వారాలు అవుతున్నప్పటికీ ఓటీటీలోకి రాకపోవడంతో..సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా.. ‘పుష్ప-2’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు సమాచారం. రీలోడెడ్ వెర్షన్‌తో పాటు త్వరలో ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story