Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. ఈ ఏడాదే రాజాసాబ్ రిలీజ్!

by Chukka Sudharani |   (  Updated:2025-05-27 11:47:46  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) ఒకటి.

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. ఈ ఏడాదే రాజాసాబ్ రిలీజ్!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) ఒకటి. మారుతి (Director Maruti) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తు్న్నారు. అయితే.. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటీ ఇందులో నుంచి సరైనా అప్‌డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా టీజర్ రాబోతున్నట్లు కూడా నెట్టింట వార్తలు రావడంతో.. దీనిపై ఎప్పుడెప్పుడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందా అని డార్లింగ్ అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత ఎస్‌కేఎన్ మరో రెండు వారాల్లో ‘రాజాసాబ్’ నుంచి అప్‌డేట్ రాబోతున్నట్లు ప్రకటించారు. అది ఏమై ఉంటుందా అనే సందిగ్దంలో ఫ్యాన్స్ ఉండగా.. ఇప్పుడు రాజాసాబ్ రిలీజ్‌కు సంబంధించి నెట్టింట పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. త్వరలో ఇదే డేట్‌ను అధికారికంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. అయితే.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, ఈ వార్త వైరల్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story