Nitya Menon: నెలరోజులకే ఓటీటీలోకి వస్తున్న నిత్యామీనన్ సినిమా.. అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

నిత్యా మీనన్(Nitya Menon) ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Nitya Menon: నెలరోజులకే ఓటీటీలోకి వస్తున్న నిత్యామీనన్ సినిమా.. అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: నిత్యా మీనన్(Nitya Menon) ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఇష్క్, గుండే జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి(S/O Satyamurthy), జనతా గ్యారేజ్(Janata Garage), భీమ్లా నాయక్(Bhimla Nayak) వంటి చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఇక ‘తిరు’ సినిమాతో ఉత్తమ నటిగా అంతర్జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. అయితే నిత్యామీనన్, జయం రవి నటించిన లేటెస్ట్ మూవీ ‘కాదలిక్కా నేరమిల్లై’(Kadhalikka Neramillai ).

ఈ సినిమాను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) నిర్మించగా.. ఆయన భార్య కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించింది. అయితే ఇందులో యోగిబాబు(Yogi Babu), వినయ్, లాల్ లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, టీజే బాను, జాన్ కోగన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక విడుదలైన నెలరోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు సమాచారం.

తాజాగా, ‘కాదలిక్కా నేరమిల్లై’ స్ట్రీమింగ్ డేట్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మేరకు ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తమిళంలో పాలు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 11 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. కాగా, నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై. డియర్ ఎక్సెస్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఆమె వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తోంది.

Next Story