ఓటీటీలో సరికొత్త రొమాంటిక్ కామెడీ క్రైమ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-07 12:34:26  IST  )

రెగ్యులర్‌గా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోలు తీసుకొస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న తెలుగు ఓటీటీ సంస్థ అయినటువంటి ఆహా(Aha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఓటీటీలో సరికొత్త రొమాంటిక్ కామెడీ క్రైమ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, సినిమా: రెగ్యులర్‌గా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోలు తీసుకొస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న తెలుగు ఓటీటీ సంస్థ అయినటువంటి ఆహా(Aha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆహా కేవలం తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో మంచి విజయం సాధించిన సినిమాలను కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు అలా ఆహా ఓటీటీలోకి మరో డబ్బింగ్ సినిమా వచ్చేసింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘వివేకానందన్ విరలను’(Vivekananda viralanu) ఇప్పుడు తెలుగులో ‘వివేకానందన్ వైరల్’(Vivekanandan Viral) అనే పేరుతో ఆహా ఓటీటీలోకి రిలీజ్ అయింది.

ఇక ‘వివేకానందన్ విరలను’ అనే సినిమా గత ఏడాది జనవరి 19 న విడుదల అయి మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కామెడీ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు కమల్(Kamal) దర్శకత్వం వహించగా.. ఇందులో షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అతని సరసన శ్వాసిక విజయ్(shasvika Vijay), గ్రేస్ ఆంటోని(Grace ANtony), మెరీనా మైఖేల్(Merina Michel), రమ్య సురేశ్(Ramya Suresh), మంజు పిళ్లై(Manju Pillai) అనే ఐదుగురు హీరోయిన్స్ నటించారు. కాగా నేటి నుంచి అనగా ఫిబ్రవరి 7 నుంచి ఈ సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

అసలు కథ విషయానికి వస్తే.. ఇద్దరు భార్యలను చేసుకొని, వాళ్లను వేధిస్తూ తిరిగే ఓ భర్త.. అతనికి బుద్ధి చెప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే కథ ఇది. ఆకట్టుకునే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ప్రతి క్షణం ఆసక్తిగా ఎంటర్‌టైన్ చేసే ‘వివేకానందన్ వైరల్’ సినిమాను భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీ నేటి నుంచి స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చింది.

Next Story