ఓటీటీలో సందడి చేస్తున్న ఖుషి మూవీ

by Phanindra |

విజయ్ దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్ల గా నటించిన మూవీ ఖుషి.

ఓటీటీలో సందడి చేస్తున్న ఖుషి మూవీ
X

దిశ,వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్ల గా నటించిన మూవీ ఖుషి. ఈ సినిమా హిట్ అయిన తర్వాత మన రౌడీ ఎక్కడా తగ్గడం లేదు. ఈ సినిమా విజయాన్ని తన అభిమానులతో పంచుకున్న విషయం మనందరికి తెలిసిందే .సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. నేడు నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తుంది. ఫీల్ గుడ్ చిత్రాలకు ఫేమస్ అయిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. థియేటర్లో మిస్ అయిన వారు ఈ రోజు ఇంట్లో కూర్చొని హ్యాపిగా చూడవచ్చు.

ఖుషి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో అర్ధరాత్రి 12 గంటలకు ఖుషి సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అడుగుపెట్టనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది . ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ ఇటీవలే ప్రకటించింది. కాగా, ఖుషి రేపే ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని మరోసారి గుర్తు చేసింది.

Next Story