Dance IKON 2 : ‘డాన్స్ ఐకాన్ వైల్డ్ ఫైర్-2 ’ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్ చేసిన ఆహా

by I. Sairam |   (  Updated:2025-01-19 11:33:57  IST  )

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘డ్యాన్స్ ఐకాన్’(Dance Ikon) షో ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకుందో మనందరికీ తెలిసిందే.

Dance IKON 2 : ‘డాన్స్ ఐకాన్ వైల్డ్ ఫైర్-2 ’ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్  చేసిన ఆహా
X

దిశ, సినిమా: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘డ్యాన్స్ ఐకాన్’(Dance Ikon) షో ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకుందో మనందరికీ తెలిసిందే. దీంతో సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తదా అని ఓటీటీ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆహా ‘డాన్స్ ఐకాన్ 2(Dance IKON 2) వైల్డ్ ఫైర్’ గురించి గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ.. ‘ఇది సాధార‌ణ డ్యాన్స్ షో కాదు.. వీళ్లు సాధార‌ణ జ‌డ్జిలు కాదు. ఈ సారి ఎన్నో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లు, ట్విస్టులు, మ‌లుపులు, అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లు ఉండ‌నున్న‌ాయి’ అని రాసుకొచ్చింది. కాగా ఈ సీజన్ ఫిబ్రవరి 14(Feb 14) నుంచి ఆహా(AHA)లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే దీనికి యాంకర్‌గా ఓంకార్(Omkar), జడ్జిలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Shekar Master), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah)లు వ్యవహరిస్తున్నారు.

Next Story