- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి వచ్చేస్తున్నా ఆంధ్రా కింగ్ తాలుకా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే(ట్వీట్)
రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka).

దిశ, వెబ్‌డెస్క్: రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri Borse) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). మహేశ్‌బాబు.పి(MAhesh Babu.P) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra) కీలక పాత్రలో నటించాడు. తెలుగు సినీ అభిమాని కథగా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల కూడా తిరక్కుండానే ఓటీటీలోకి రాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 25 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.






