- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాదాపు రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఓటీటీలోకి రాబోతున్న సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే(ట్వీట్)
డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ అటు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ఇటు యూత్‌ను సైతం ఎంటర్‌టైన్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ అటు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ఇటు యూత్‌ను సైతం ఎంటర్‌టైన్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) మనందరికీ సుపరిచితమే. ఆయన గత ఏడాది ఫ్యామిలీ డ్రామా మూవీ 'మనమే' (Maname)తో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య(Sriram Aditya) తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించగా.. హీషం అబ్దుల్ వహాద్ సంగీతం అందించారు.
ఇక ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది జూన్ 7న మూవీ రిలీజ్ అయి ఓకే ఓకే అనిపించుకుంది. అయితే దాదాపు సంవత్సరం కావోస్తున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. అయితే డీల్ సెట్ కాకపోవడంతో ఇప్పటివరకూ ఓటీటీలోకి రాలేదని తెలుస్తోంది. తాజాగా.. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకుంది. ఈ నెల 9 నుంచి 'మనమే' ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా హీరో శర్వానంద్ ఖాతాలో చాలాకాలంగా మంచి హిట్ పడలేదు. ప్రస్తుతం శర్వా హీరోగా రామ్ అబ్బరాజు(Ram Abbaraju) దర్శకుడిగా వస్తోన్న లేటెస్ట్ మూవీ 'నారీ నారీ నడుమ మురారీ'(Nari Nari Naduma Murari). ఈ మూవీలో సంయుక్త మీనన్(samyuktha menon), సాక్షి వైద్య(Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర్(Anil Suknkar) నిర్మిస్తున్నారు. అయితే సినిమాకు బాలయ్య(Nalakrishna) సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.
అలాగే, అభిలాష్ రెడ్డి(Abhilash Reddy) దర్శకత్వం వహించిన మరో మూవీకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) 'జానీ'(Johnny) టైటిల్‌ను పెట్టుకోబోతున్నట్లు సమాచారం. శర్వా హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో శర్వానంద్‌కు తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్(Rajashekhar) నటిస్తున్నట్లు సమాచారం. పవన్ సినిమా టైటిల్ పెడుతున్నందుకు మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






