- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డైరెక్టర్ శంకర్‌కు వార్నింగ్ ఇచ్చిన నిర్మాత
<p>దిశ, సినిమా : డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు (అన్నియన్ )’ హిందీ అడాప్టేషన్ ప్రకటించిన కొద్ది గంటలకే నిర్మాత ఆస్కార్ వీ రవిచంద్రన్ నుంచి విమర్శనాత్మక ప్రెస్ నోట్ వెలువడింది. శంకర్ అనౌన్స్‌మెంట్‌తో షాక్ అయ్యానని తెలిపిన ప్రొడ్యూసర్.. స్టోరీ లైన్ రైట్స్ పూర్తిగా తనకే చెందుతాయని తెలిసి కూడా ఇలా చేశాడని ఆరోపించారు. రైటర్ సుజాత(అలియాస్ దివంగత రంగరాజన్) నుంచి స్టోరీ రైట్స్ కొనుగోలు చేసిన విషయం శంకర్‌కు తెలుసన్న రవిచంద్రన్.. అయినా తన పర్మిషన్ […]</p>

దిశ, సినిమా : డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు (అన్నియన్ )’ హిందీ అడాప్టేషన్ ప్రకటించిన కొద్ది గంటలకే నిర్మాత ఆస్కార్ వీ రవిచంద్రన్ నుంచి విమర్శనాత్మక ప్రెస్ నోట్ వెలువడింది. శంకర్ అనౌన్స్‌మెంట్‌తో షాక్ అయ్యానని తెలిపిన ప్రొడ్యూసర్.. స్టోరీ లైన్ రైట్స్ పూర్తిగా తనకే చెందుతాయని తెలిసి కూడా ఇలా చేశాడని ఆరోపించారు. రైటర్ సుజాత(అలియాస్ దివంగత రంగరాజన్) నుంచి స్టోరీ రైట్స్ కొనుగోలు చేసిన విషయం శంకర్‌కు తెలుసన్న రవిచంద్రన్.. అయినా తన పర్మిషన్ లేకుండా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడని, ఇది పూర్తిగా ఇల్లీగల్ అని చెప్పారు.
‘బాయ్స్’ సినిమా తర్వాత డిప్రెషన్‌లో ఉన్న శంకర్‌కు తనే సపోర్ట్ చేశానని, ఇప్పటికి కూడా ‘అన్నియన్’ రీమేక్‌కు అనుమతించగలను కానీ.. అనుమతి లేకుండా తన సినిమా ‘అన్నియన్’ అడాప్షన్ ద్వారా ప్రశంసలు పొందాలని ప్రయత్నించడం సరికాదన్నారు. శంకర్ ఎప్పుడూ ఎథికల్ వాల్యూస్ మెయింటైన్ చేస్తాడనుకున్నాను గానీ ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలతో దిగజారిపోతాడని అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తదుపరి ప్రొసీడింగ్స్ ఆపాలని సూచించిన ఆస్కార్ వీ రవిచంద్రన్.. స్టోరీ లైన్ ఇల్లీగల్‌గా యూజ్ చేస్తున్నందుకు లీగల్ నోటీసులు అందుకునేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.






