పొల్యూషన్ చేస్తే రూ. కోటి కట్టాల్సిందే

97

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని, ఉత్తర భారతంలో కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య కారకులకు చెక్ పెట్టేందుకు భారీగా జరిమానా, జైలు శిక్ష విధించేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఇందు కోసం 20 మంది సభ్యలతో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఆర్డినెన్స్ విడుదల చేసింది. దీని ప్రకారం కాలుష్య కారకులకు రూ. కోటి జరిమానాతో పాటు 5 ఏండ్ల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ నేపథ్యంలో ఈ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో అటవీ శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పాడే కమిటీలో.. రవాణా, వాణిజ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర శాఖల మంత్రులు సభ్యులుగా వ్యవహరించనున్నారు.